రాజానగరంలో అట్టహాసంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్


రాజానగరం, BCN NEWS 15: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజానగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూటమి నేతలతో కలిసి రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.


ప్రారంభ కార్యక్రమంలో రుడా చైర్మన్, టిడిపి ఇన్‌చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి సహా కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, పేదవారి ఆకలి తీర్చే లక్ష్యంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ప్రభుత్వ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మూసివేయబడిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి పేదల ఆకలి తీర్చడం అభినందనీయమని అన్నారు.

రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now