అశ్వరావుపేటలో బీఆర్‌ఎస్ నేత పర్యటన


అశ్వరావుపేట, BCN NEWS: నియోజకవర్గంలో మంగళవారం పలు కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పాల్గొన్నారు. ముందుగా దమ్మపేట మండలం కొమ్ముగుడెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను అందరూ అనుభవిస్తున్నారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


అనంతరం అశ్వరావుపేట మండలం కేసప్పగూడెం గ్రామంలో జరిగిన రాఘవయ్య – కనకమహాలక్ష్మి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన జంటకు ఆశీర్వాదాలు అందించారు. కుటుంబ సభ్యులతో మమేకమై శుభాకాంక్షలు తెలిపారు.

తదుపరి దమ్మపేట మండలం మంధలపల్లిలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గారి కుమార్తె కీర్తిశేషులు మహాలక్ష్మి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమాల్లో దమ్మపేట మండలం మాజీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, తాటి పోతురాజు, పర్వతనేని ప్రసాద్, కొమ్ముగుడెం సర్పంచ్ సోయం సత్యవతి–సత్యనారాయణ, ఉప సర్పంచ్ బుద్దుల శ్రీను, బుద్దుల కృష్ణ, వెంకన్నబాబు, వుకే నరసింహారావు, కీసరి మల్లికార్జునరావు, యువ నాయకుడు వాడే వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now