ఏలూరు/కలిదిండి, ఆగస్టు 09: ఈ నెల 10తేదీ సోమవారం కలిదిండి మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న “మీభూమి-మీహక్కు” రాజముద్రతతో పొందుపరిచిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించి, విజయవంతం చెయ్యాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులకు ఆదేశించారు.
ఆదివారం కలిదిండి ప్రభుత్వ జూనియర్ కాలేజీ హెలిప్యాడ్, ప్రజావేదిక, తహశీల్దారు కార్యాలయం, క్యాడరు సమావేశం, ట్రాన్స్‌పోర్ట్, భోజనాలు, పార్కింగు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలుసూచనలు చేశారు. మంత్రితోపాటు ఎమ్మెల్యేలు డా. కామినేని శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణయ్య(చంటి), ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వర రావు, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ లు పాల్గొన్నారు. అనంతరం అగ్రికల్చర్ మార్కెటు కమిటీ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి పర్యటనపై సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు, వైద్య సదుపాయాలు తదితర అంశాలుపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. సంబంధిత శాఖలు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, పర్యటన సజావుగా జరిగేలా అవసరమైన అన్నిచర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తిచెయ్యాలని ఆదేశించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, లోటుపాట్లు ఉంటే వెనువెంటనే సరిదిద్దాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముఖ్యమంత్రి పర్యటనను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చెయ్యాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టామని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమకు జరిగిన లబ్దిని తెలియజెయ్యాలని, అభిమానం, ఆనందంతో ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమానికి మరింత ఊతం లభిస్తుందని, ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి యం. శ్రీదేవి, సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జెడ్పీ సిఈవో పి. జగదాంబ, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న, వివిధ శాఖలు అధికారులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీరామకృష్ణ, మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, మాజీ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొత్త నాగబాబు, ప్రజా ప్రతినిధులు, నియోజవర్గ ప్రముఖులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
_11zon.jpeg)