భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, BCN NEWS: జగ్గారం గ్రామంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సబ్ స్టేషన్ల సంఖ్య పెరగడం వల్ల రైతులకు నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
అదేవిధంగా గండుగులపల్లి గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోతు భీముడు నాయక్, అన్నపురెడ్డిపల్లి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
