ఏలూరులో అంబేద్కర్‌కు ఘన నివాళులు


ఏలూరు, BCN NEWS ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏలూరులో ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కలిసి పూలమాలలు వేసి స్మరించారు.


ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు సమాజంలో కుల వివక్ష నిర్మూలనకు జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన ఆయన ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన సమాన హక్కుల ఫలితమేనని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, సెట్‌వెల్ సీఈఓ ప్రభాకర్, ఉద్యానవన శాఖ డీడీ సాజానాయక్, ఐడీఏ చైర్మన్ శివప్రసాద్, తహసీల్దార్ గాయత్రి, షెడ్యూల్డ్ కులాల సంఘాల నాయకులు మెండెం సంతోష్, మేతర అజేయ్, నేతల రమేష్, పొలిమేర హరికృష్ణ, జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now